KTR: అల్ల‌రి న‌రేశ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌కుల్, అన‌సూయ‌ల‌కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్‌!

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ నెల 20న ఢిల్లీలో బిజినెస్ వరల్డ్ 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకోనున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు టాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంసల జ‌ల్లు అందుతోంది. సినీన‌టులు అల్ల‌రి న‌రేశ్‌, మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ, వెన్నెల కిషోర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, అన‌సూయ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్లు చేశారు. వారే కాక సినీ ప్ర‌ముఖులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, కోన వెంకట్, బీవీఎస్ రవి, మెహర్ రమేశ్, సుధీర్ వ‌ర్మ కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరంద‌రికీ పేరు పేరునా మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.   
KTR
allari naresh
thanks
tweets
rakul preet singh

More Telugu News