fire accident: ముంబైలో 12 మంది సజీవ దహనం.. పలువురికి తీవ్రగాయాలు

  • దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం
  • కాలి బుగ్గైన 12 మంది
  • ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని ఖైరానీ రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో ఈ ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగి ఐదు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

సజీవదహనం అయిన వారిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అనే కోణంలో గాలింపు జరుపుతున్నారు. జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
fire accident
fire accident in mumbai

More Telugu News