ఎరుపు రంగులో ఎమ్ఐఏ1 స్మార్ట్‌ఫోన్... భారత్‌లో విడుదల చేసిన షియోమీ
- డిసెంబర్ 20న ప్రత్యేక సేల్
- ఫ్లిప్‌కార్ట్, ఎమ్ఐ.కామ్‌ల్లో అమ్మకాలు
- ధర రూ. 12,999
డిసెంబర్ 20న ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జరగనుంది. రూ. 12,999 ధర గల ఈ స్పెషల్ ఎడిషన్ రెడ్ వేరియంట్‌ను ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్, ఎమ్ఐ.కామ్‌ల్లో అమ్మకానికి పెట్టనున్నారు. ఆఫ్‌లైన్‌లో ఎమ్ఐ హోం స్టోర్లలో, పార్ట్నర్ స్టోర్లలో కూడా లభించనుంది. గూగుల్ వారి ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన ఈ ఫోన్ నాణ్యత పరంగా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.