Prakash Raj: మోదీ... ఆర్యూ రియల్లీ హ్యాపీ?: ప్రకాష్ రాజ్

  • మోదీని టార్గెట్ చేసుకుని ప్రశ్నాస్త్రాలు
  • విజయం అంత గొప్పదేమీ కాదన్నట్టు వ్యాఖ్యలు
  • 150 సీట్లు ఎక్కడ సాధించారు?
  • ప్రజా వ్యతిరేకత స్పష్టమైందన్న ప్రకాశ్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రియమైన ప్రధాని గారూ... అంటూనే, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం అంత గొప్పదేమీ కాదన్నట్టు ఎద్దేవా చేశారు. "విజయం సాధించినందుకు అభినందనలు. కానీ, ఈ ఫలితాలతో మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? 150కి పైగా సీట్లు సాధిస్తామని చెప్పారు కదా? ఏమయింది? ఒకసారి పునరాలోచించుకోండి.

సమస్యలు ఎక్కడున్నాయో, వాటిని ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి. మీ విభజన రాజకీయాలు పనిచేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను, పేదలను, రైతులను మీరు నిర్లక్ష్యం చేశారు. వారి గొంతుక ఈ ఎన్నికల్లో వినిపిస్తోంది. మీరు వింటున్నారా?" అని ట్వీట్ చేశారు. కాగా, 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ప్రకాశ్ ఇటీవలి కాలంలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.



Prakash Raj
Twitter
Narendra Modi
Just Asking

More Telugu News