Narendra Modi: మోదీతో భేటీ అయిన కీలక నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్

  • ఎన్నికల ఫలితాల సరళిపై చర్చ
  • ఆనందం వ్యక్తం చేసిన మోదీ
  • ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్న రాజ్ నాథ్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రధాని మోదీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల సరళిపై వీరు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు.

భేటీకి ముందు రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం ఊహించినదే అని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలు ప్రతీక అని చెప్పారు. బీజేపీ మరింత బలపడిందని అన్నారు. 
Narendra Modi
amit shah
rajnath singh
gujarat treds

More Telugu News