Himachal Pradesh: హిమాచల్ లో తొలి విజయం కాంగ్రెస్ కు: ఈసీ

  • కసుంప్తిలో విజయం సాధించిన అనిరుధ్ సింగ్
  • 9,896 ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి
  • స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతున్న బీజేపీ
 హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని దక్కించుకుంది. ఎలక్షన్ కమిషన్ తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం, కసుంప్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు చెందిన అనిరుధ్ సింగ్, తన సమీప బీజేపీ ప్రత్యర్థి విజయ్ జ్యోతిపై 9,896 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 65 నియోజకవర్గాలున్న హిమాచల్ లో 64 చోట్ల కౌంటింగ్ సాగుతుండగా, 40 స్థానాల్లో బీజేపీ, 21 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ (ఎం) ఒక చోట, స్వతంత్రులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. లెక్కించిన ఓట్లలో బీజేపీకి 48.5 శాతం ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ కు 42 శాతం ఓట్లు లభించాయి.
Himachal Pradesh
Congress
BJP

More Telugu News