KTR: ఇవేమి ఫలితాలు... ఒక్కోరు ఒకలా చెబుతున్నారు: కేటీఆర్

  • విభిన్నంగా స్పందించిన కేటీఆర్
  • ఫలితాల సరళి చాలా కన్ఫ్యూజింగ్
  • ఒక్కో చానల్ ఒక్కోలా చూపుతోంది
  • నిజాన్ని ఎవరూ మార్చలేరన్న కేటీఆర్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళిపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ వినూత్నంగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఫలితాలు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక్కో చానల్ ఒక్కోలా ఫలితాలను చూపిస్తోందని, ఎవరు, ఎక్కడ ముందంజలో ఉన్నారన్న విషయమై స్పష్టత లేదని అన్నారు.

 ఎవరి అభిప్రాయాలు వారివేనన్న విషయం తనకు తెలుసునని, అయితే, నిజాన్ని, వాస్తవ విజయాన్నీ ఎవరూ మార్చలేరని అన్నారు. ఆయన ట్వీట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీవీ స్విచ్ ఆఫ్ చేయాలని, కాసేపు ఏ వార్తా వినవద్దని నెటిజన్లు సలహాలు, సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
KTR
Twitter
Gujarath

More Telugu News