gujarat elections: క్షణక్షణానికి మారుతున్న ట్రెండ్స్.. మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ

  • ఉత్కంఠను రేపుతున్న ట్రెండ్స్
  • క్షణక్షణానికి తారుమారవుతున్న ఆధిక్యత
  • 95 స్థానాల్లో బీజేపీ ముందంజ
గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో క్షణక్షణానికి ట్రెండ్స్ మారుతున్నాయి. క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆధిక్యం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తారుమారు అవుతోంది. ఈ ట్రెండ్స్ దేశ వ్యాప్తంగా ఉన్న కీలక రాజకీయ నేతలు, ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇంతలోనే మళ్లీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ 95 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 85 స్థానాల ఆధిక్యానికి పడిపోయింది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే, గుజరాత్ లో హోరాహోరీ పోరు జరిగిందనే విషయం మాత్రం అర్థమవుతోంది. 
gujarat elections
gujarat treds
Congress
BJP

More Telugu News