టీమిండియా: విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం ... సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా!
- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం
- సెంచరీ చేసిన ధావన్
- 32.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్
విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 32.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 219 పరుగులు చేసింది. దీంతో, మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది.
భారత్ స్కోర్ : 219/2
భారత్ బ్యాటింగ్ : రోహిత్ శర్మ (7), శ్రేయస్ అయ్యర్ (65), ధావన్ 100, కార్తీక్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
శ్రీలంక స్కోర్: 215 ఆలౌట్
శ్రీలంక బౌలింగ్ : ధనంజయ్ - 1, పెరీరా - 1