pakistan: పాక్ రక్తసిక్తం.. చర్చిపై ఉగ్రదాడి!

  • క్వెట్టాలో మారణహోమం.. నెత్తురోడిన చర్చ్ 
  • ఐదుగురి దుర్మరణం... 20 మందికి గాయాలు 
  • పవిత్ర స్థలంలో నరమేధం 
వరుస ఉగ్రదాడులతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. బెలూచిస్థాన్ లోని క్వెట్టా నగరంలో ఉన్న ఓ చర్చిపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా... మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక జార్ఘన్ రోడ్డులో ఉన్న బెథెల్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చి లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది.

ఆత్మాహుతి బాంబర్లు చర్చిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా... భద్రతాదళాలు ఒక ముష్కరుడిని గేటు వద్దే హతమార్చాయి. మరో సూసైడ్ బాంబర్ చర్చి ప్రాంగణంలోకి దూసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రార్థనలు జరగాల్సిన పవిత్ర స్థలం నెత్తురోడింది. క్షతగాత్రుల హాహాకారాలతో చర్చి ప్రాంగణం భయానకంగా మారింది. 
pakistan
quetta

More Telugu News