విశాఖ: మూడో వన్డే ... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

  • భారత్-శ్రీలంక మధ్య చివరి వన్డే
  • విశాఖ వేదికగా మ్యాచ్
  • ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే  వన్డే సిరీస్  

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా, ఫీల్డింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తో సిరీస్ ఏ జట్టు కైవసం చేసుకుంటుందో తేలిపోతుంది. మూడో వన్డేల సిరీస్ లో సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు, ఈ వన్డేలో గెలుపు కోసం పోటీపడుతున్నాయి.

కాగా, మొదటి వన్డే ధర్మశాలలోను, రెండో వన్డే మొహాలీలోను జరిగాయి. మొదటి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన భారతజట్టు, రెండో వన్డేలో అద్భుతమైన విజయం సాధించి లంక జట్టుకు చుక్కలు చూపించింది.

  • Loading...

More Telugu News