mahesh babu: 5 మిలియన్ల ఫాలోయర్ల క్లబ్ లో మహేష్ బాబు!

  • ట్విట్టర్ లో దూసుకుపోతున్న మహేష్ బాబు
  • 5 మిలియన్లను దాటినవారిలో ధనుష్, సమంత
  • త్రిషతో సమానంగా రజనీకాంత్
టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మహేష్ కు అభిమానులు ఉన్నారు. తనకు సంబంధించిన విషయాలను, అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో మహేష్ పంచుకుంటుంటాడు. తాజాగా, ట్విట్టర్ లో మహేష్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటింది.

ఇక తెలుగులో మహేష్ తర్వాత 4.5 మిలియన్ ఫాలోయర్లతో నాగార్జున, 4.48 మిలియన్ ఫాలోయర్లతో రానా ఉన్నారు. రాజమౌళిని 3.75 మిలియన్లు, పవన్ కల్యాణ్ ను 2.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ 6.4 మిలియన్ల ఫాలోయర్లతో దూసుకుపోతుండగా... త్రిషతో సమానంగా రజనీకాంత్ 4.4 మిలియన్ల ఫాలోయర్లను కలిగి ఉన్నారు. హీరోయిన్ సమంత కూడా 5 మిలియన్లకు పైగా ఫాలోయర్లను కలిగి ఉంది.      
mahesh babu
tollywood
mahesh babu twitter

More Telugu News