sai dharam tej: ఒకే రోజున రంగంలోకి దిగుతోన్న మెగా హీరోలు!

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'ధర్మా భాయ్'
  • ఫిబ్రవరి 9న విడుదల చేసే ఆలోచన 
  • ఆ రోజే రానున్న వరుణ్ తేజ్ 'తొలిప్రేమ'  
సాయిధరమ్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి 'ధర్మా భాయ్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో సాయిధరమ్ తేజ్ వున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పాటలను ఈ నెల 18వ తేదీ నుంచి తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. అలాగే సాధ్యమైనంత త్వరలో  క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు.

ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే వరుణ్ తేజ్ చేస్తోన్న 'తొలిప్రేమ' సినిమాను కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఒకే రోజున మెగా హీరోలు రంగంలోకి దిగుతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇదే రోజున మోహన్ బాబు 'గాయత్రి' .. నిఖిల్ 'కిరాక్ పార్టీ' కూడా విడుదలవుతుండటం విశేషం.     
sai dharam tej
varun teuj

More Telugu News