PV Sindhu: పీవీ సింధు మరో సంచలనం.. తొలిసారి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోకి

  • బీడబ్ల్యూఎఫ్‌లో ఇరగదీస్తున్న సింధు
  • వరుస విజయాలతో ఫైనల్స్‌కు 
  • పతకానికి ఒక్క అడుగు దూరంలో తెలుగు తేజం
బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. దుబాయ్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌‌కి చేరిన సింధు మెగా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

 శనివారం జరిగిన సెమీస్‌ పోరులో మూడో ర్యాంకర్ అయిన సింధు చైనా స్టార్ ప్లేయర్, 8వ ర్యాంకర్ అయిన చెన్ యుఫీని చిత్తు చేసింది. 21-15, 21-18తో వరుస సెట్లలో మట్టి కరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. నేడు (ఆదివారం) రెండో ర్యాంకర్ అయిన అకానె యమగుచితో టైటిల్ పోరు జరగనుంది.  
PV Sindhu
BWF
Badminton
Dubai

More Telugu News