sharwanand: రకుల్ 'దాగుడు మూతలు' .. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట!

  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు'
  • దిల్ రాజు నిర్మాణంలో వరుసగా నాల్గొవ సినిమా
  • నితిన్ జోడీగా సాయిపల్లవి       
మాస్ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలతో కథలను సిద్ధం చేసుకునే దర్శకులలో హరీష్ శంకర్ ఒకరుగా కనిపిస్తాడు. తాను తెరకెక్కించే కథలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించే విషయంలో ఆయన చాలా వరకూ సక్సెస్ అవుతూ వచ్చాడు. ఆయన దర్శకత్వం వహించిన 'రామయ్యా వస్తావయ్యా' .. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

 హరీశ్ శంకర్ తాజా చిత్రం 'దాగుడు మూతలు'కు కూడా దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. నితిన్ .. శర్వానంద్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. శర్వానంద్ సరసన రకుల్ ను సంప్రదించారు. ఆమె ఓకే అన్నట్టుగా ప్రచారం జరిగింది గానీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. హరీశ్ శంకర్ కి 'ఎస్' అని గానీ .. 'నో' అని గాని చెప్పకుండా ఆయనతో ఆమె 'దాగుడుమూతలు' ఆడుతోందని కొందరు జోక్ చేస్తున్నారు కూడా.      
sharwanand
nithin
sai pallavi

More Telugu News