Kamal Haasan: రాహుల్, నువ్వు మా మెప్పు పొందేలా పని చేస్తావ్... నాకా నమ్మకం ఉంది: కమలహాసన్ ట్వీట్

  • మీ స్థానాన్ని మీరు నిర్వచించుకునే సామర్థ్యం ఉంది
  • మీ పెద్దలంటే అభిమానం ఉంది
  • మీరు అలానే పనిచేస్తారని ఆశిస్తున్నానంటూ ట్వీట్
విఖ్యాత నటుడు కమలహాసన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేశారు. దీనిపై ట్విట్టర్ సామాజిక మాధ్యమం ద్వారా కమల్ స్పందించారు. ‘‘మిస్టర్ రాహుల్ జీ మీకు శుభాకాంక్షలు. మీ పదవి మిమ్మల్ని నిర్దేశించలేదు. మీరే మీ బాధ్యతలను నిర్వచించగలరు. మీ పెద్దలంటే నాకు ఎంతో అభిమానం. మీరు కూడా నా ప్రశంసలు పొందేలా పనిచేస్తారని నమ్మకంతో ఉన్నాను. మీ భుజాలకు అంత బలం ఉంది’’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.

 47 ఏళ్ల రాహుల్ కాంగ్రెస్ పార్టీకి 49వ అధినేతగా ఈ రోజు తన తల్లి సోనియా గాంధీ నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖులు రాహుల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాను సైతం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు కమలహాసన్ ఇటీవలే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్ పదవీ స్వీకారంపై కమల్ స్పందించిన తీరు ఆకట్టుకునేలా ఉంది.
Kamal Haasan
rahul gandhi
tweet

More Telugu News