పాకిస్థాన్ లో హైదరాబాదీ మహిళ నరకయాతన... టికెట్ కొనిచ్చి ఆదుకున్న సుష్మాస్వరాజ్!
- పాకిస్థాన్ లో హైదరాబాద్ మహిళకు వేధింపులు
- భారత్ కు వచ్చేందుకు వీసా మంజూరు చేయించిన సుష్మ
- డబ్బుల్లేవని తెలియడంతో టికెట్ కూడా ఉచితంగా అందించే ఏర్పాటు
హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ బేగం 1996లో ఓ పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లాడి ఆ దేశం వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత భర్త ఆమెను చిత్ర హింసలకు గురి చేయడంతోపాటు భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా నిర్బంధానికి గురి చేశాడు. ఈ విషయాన్ని మొహమ్మద్ బేగం తండ్రి అక్బర్ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెకు వీసా జారీ చేయించారు. టికెట్ కు డబ్బుల్లేవని తెలియడంతో అది కూడా ఉచితంగానే అందించే ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సుస్మాస్వరాజ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.