Chandrababu: ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం లేకపోవడంపై స్పందించిన చంద్రబాబు!

  • మరేం పర్లేదన్న ఏపీ ముఖ్యమంత్రి
  • తెలుగు భాష పరిరక్షణ కోసం జరిగే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్న బాబు
  • తెలుగు వారు ఎక్కడున్నా కలిసి ఉండాలని ఆకాంక్ష
హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవిదేశాల నుంచి 8వేల మందికిపైగా ప్రతినిధులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్టహాసంగా జరుగుతున్న తెలుగు సభలకు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖులను ఆహ్వానించినా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందలేదు.

ఈ నేపథ్యంలో తెలుగు మహాసభలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆహ్వానం రాకపోయినా పరవాలేదన్నారు. తెలుగు భాషను అందరూ గౌరవించాలని అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు జరిగే ఏ కార్యక్రమానికైనా టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.
Chandrababu
KCR
World Telugu Meet
Hyderabad

More Telugu News