china: 10వ అంతస్తు గది కిటికీ నుంచి జారి కింద పడిన యువతి.. స్వల్ప గాయాలు!
బాగా మద్యం తాగి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు గది కిటికీ నుంచి జారి కింద పడిన యువతి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రియుడితో బ్రేకప్ అయిన ఓ యువతి గువాంషీ ప్రావిన్స్‌లోని ఓ హోటల్లో ఓ రూమ్ తీసుకుని తన స్నేహితురాళ్లతో కలసి మద్యం తాగింది. మత్తులో కిటికీ వద్దకు ఊగుతూ వచ్చిన ఆమె ఒక్కసారిగా పడిపోయి కింద ఉన్న ఉన్న కారుపై పడింది.
దీంతో కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ కారు ఆమె బరువును ఆపగలగడంతో స్వల్పంగా మాత్రమే గాయాలయ్యాయి. కానీ, సృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా తీసిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి.