బండ్ల గణేష్: బండ్ల గణేష్ కు ధైర్యముంటే ఫోన్ స్విచ్ ఆన్ చేయాలి: వైసీపీ నేత బండి పుణ్యశీల
- బండ్ల గణేష్ విజయవాడ వచ్చి మాట్లాడాలి
- ఆంధ్రా రాజకీయాలు మీకెందుకు?
- మీడియాతో బండి పుణ్యశీల
ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం, వైసీపీ మహిళ నేత బండి పుణ్యశీల మాట్లాడుతూ, రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని, ఆయనకు ధైర్యముంటే, స్విచ్చాన్ చేయాలని అన్నారు.
బండ్ల గణేష్ విజయవాడ వచ్చి మాట్లాడాలని, అసలు, ఆంధ్రా రాజకీయాలు ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. ‘మీపై హీరోయిన్ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? మీపై హీరో సచిన్ జోషి పెట్టిన కేసు విషయమై మీ తండ్రి హీరో కాళ్లు పట్టుకున్నసంగతి మర్చిపోయారా?’ అని గణేష్ ని ఆమె ప్రశ్నించారు. రోజాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.