ramcharan: రామ్ చరణ్ ఇంట్లో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్

  • ఆహ్వానించిన రామ్ చరణ్, ఉపాసన 
  • క్రిస్మస్ ముందస్తు వేడుకలకు హాజరు
  • కుటుంబ సభ్యులతో కలసి వెళ్లిన ఎన్టీఆర్
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, మరో ప్రముఖ హీరో రామ్ చరణ్ ఒక్కచోట కలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఇక అక్కడంతా ‘రచ్చే’. నిజంగానే ఇది జరిగింది. రామ్ చరణ్ ఇంట్లో ఇరు కుటుంబాలు కలసి సందడి చేశాయి. రామచరణ్ తేజ్ ఇంట్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఆహ్వానంపై జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వారి ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా పొటోలు కూడా దిగారు. మరో విశేషం ఏమిటంటే క్రిస్మస్ ట్రీని ఉపాసన విస్తరాకులతో స్వయంగా రూపొందించారు.
ramcharan
Jr-NTR

More Telugu News