Jallikattu: జల్లికట్టుపై కేంద్రం సంచలన నిర్ణయం.. అనుమతినిస్తూ చట్టసవరణ.. నిర్వాహకుల్లో జోష్!

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో గతేడాది ఆగిన జల్లికట్టు
  • నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
  • దిగొచ్చిన కేంద్రం.. చట్టసవరణ
  • జల్లికట్టు నిర్వాహకుల్లో జోష్.. సంక్రాంతికి ముందే నిర్వహణకు ఏర్పాట్లు
తమిళనాడులో పెద్ద ఎత్తున నిర్వహించే సంప్రదాయ జల్లికట్టు ఆటపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జల్లికట్టుపై నిషేధానికి నిరసనగా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. 1960 జంతుహింస చట్టాన్ని సవరించింది.

గతేడాది నిర్వహించాల్సిన జల్లికట్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆగిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. ఆందోళనకారులకు సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో కేంద్రం దిగివచ్చింది. 1960 జంతు హింస చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది.

కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జల్లికట్టుకు సిద్ధమవుతున్నారు. అయితే సంక్రాంతికి ముందే వచ్చే నెల 7న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంఘం పెటా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో వివాదం మరోమారు మొదటికొచ్చినట్టు అయింది.
Jallikattu
Tamilnadu
Supreme Court
peta

More Telugu News