Roja: పవన్‌ 'గుండు' ఉదంతంపై రోజా సంచలన వ్యాఖ్యలు.. సెటైర్లు!

  • పవన్ గుండుపై క్లారిటీ ఇచ్చిన రోజా
  • పవన్‌కు టీడీపీ గుండు కొట్టించింది వాస్తవమేనన్న వైసీపీ నేత
  • 2019లో మరోమారు టీడీపీ గుండు కొట్టబోతోందని హెచ్చరికలు
కొన్నేళ్ల క్రితం హాట్ టాపిక్ అయిన పవన్ కల్యాణ్ గుండు వ్యవహారం తాజాగా మరోమారు వైరల్ అయింది. ఇటీవల ఏపీలో పర్యటించిన జనసేన చీఫ్ తన గుండు విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి నుంచి పవన్ ‘గుండు’పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మంత్రి పరిటాల సునీత కూడా ఈ విషయంపై స్పందించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పవన్ కల్యాణ్ గుండుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనన్నారు. తానప్పుడు టీడీపీలోనే ఉన్నానని, అయితే ఆ విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. పవన్ చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు నిజమేనని నమ్మొచ్చన్నారు. కాగా, 2014లో పవన్‌కు టీడీపీ మరోమారు గుండు కొట్టించిందని, 2019లో మళ్లీ అదే పని చేయడం ఖాయమని ఆమె సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని టీడీపీతో జాగ్రత్తగా ఉంటే మేలని సూచించారు.
Roja
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News