డీకే అరుణ: నా భార్య రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వాటి జోలికి పోను : డీకే అరుణ భర్త భరత సింహారెడ్డి
- నా భార్య అడిగితే సలహాలిస్తాను
- వాటిని అమలు చేయమని మాత్రం చెప్పను
- ఓ ఇంటర్వ్యూలో భరతసింహారెడ్డి
తన భార్య డీకే అరుణ అడిగితే సలహాలిస్తానే తప్పా, వాటిని అమలు చేయాలని తాను ఎప్పుడూ చెప్పనని ఆమె భర్త భరతసింహారెడ్డి అన్నారు. ‘యోయో’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో ముందుకు నడిపించానని, ఇప్పుడు తన అవసరం లేదని, అన్ని విషయాలు ఆమెకే తెలిశాయని అన్నారు.
తన భార్య రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు, తాను రాజకీయాల జోలికి పోనని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తామిద్దరం ఒకేసారి రాజకీయాల్లో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. ‘తెలుగులో ఓ సామెత ఉంది. తల్లీపిల్లా రాజకీయాల్లోకి వస్తే.. ఇంట్లో వండిపెట్టే దిక్కుండదు. ఆ పరిస్థితి వద్దు’ అని చెప్పుకొచ్చారు.