‘పోలవరం’: ‘పోలవరం’పై కేవీపీ కోర్టుకు వెళ్లడం మంచి పని!: మాజీ ఎంపీ ఉండవల్లి

  • 19 లోగా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి
  • నీళ్లల్లోనే కాంక్రీట్ వేసి పనులు చేస్తున్నారు 
  • సంబంధిత ఫొటోలను సీఎం చంద్రబాబుకు పంపించా 

‘పోలవరం’పై కేవీపీ కోర్టుకు వెళ్లడం మంచి పని అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 19 లోగా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని, ప్రభుత్వం వెంటనే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నీళ్లల్లోనే కాంక్రీట్ వేసి పనులు చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం చంద్రబాబుకు పంపించానని అన్నారు.

 ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెలికి తీస్తానని నాడు హామీ ఇచ్చిన మోదీ, ఈ విషయాన్ని దారి మళ్లించేందుకే పెద్దనోట్ల రద్దును తెరపైకి తెచ్చారని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో మధ్య తరగతి ప్రజలే తీవ్రంగా నష్టపోయారని, ఎఫ్ఆర్డీఏ చట్టం దేశాన్ని నాశనం చేసే విధంగా ఉందని, పటిష్టమైన మన బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసే యత్నమిదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News