Chandrababu: అన్నీ ఆన్ లైన్లో పెట్టాం.. చెక్ చేసుకోండి: చంద్రబాబు

  • పోలవరం నా జీవితాశయం
  • పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టను
  • వివరాలన్నీ ఆన్ లైన్లో ఉంచాం
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ఆశయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయని చెప్పారు. కొందరు మాత్రం కావాలనే పోలవరంపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై ఉడుం పట్టు పట్టానని... ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. పోలవరంకు సంబంధించిన ఖర్చుల వివరాలన్నింటినీ ఆన్ లైన్ లో ఉంచామని... శ్వేత పత్రాలు అడిగేవారు ఆన్ లైన్లో చెక్ చేసుకోవాలని సూచించారు. 
Chandrababu
polavaram project

More Telugu News