mukhesh goud: టీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్!

  • కాంగ్రెస్ కు ముఖేష్ గుడ్ బై
  • టీఆర్ఎస్ లో చేరేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
  • రేపు అనుచరులతో భేటీ
మాజీ మంత్రి, హైదరాబాద్ గోషామహల్ మాజీ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. గత ఏడాది కాలంగా ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చివరకు ఇది వాస్తవ రూపం దాల్చబోతోంది. ముఖేష్ చేరికకు సంబంధించి నగరానికి చెందిన ఓ ఎంపీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాయబారం నడిపారని తెలుస్తోంది. తన అనుచరులతో రేపు ముఖేష్ గౌడ్ సమావేశం కానున్నారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరబోయే తేదీని ఆయన ప్రకటిస్తారు.
mukhesh goud
TRS

More Telugu News