queen: అదే నేనైతే అతడి కాళ్లు విరగ్గొట్టేదాన్ని: ‘క‌్వీన్’ హీరోయిన్
- దంగల్ నటిపై విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన
- స్పందిస్తూ కంగనా రనౌత్ ఆగ్రహం
- దారుణాన్ని బయటికి చెప్పడంలో తప్పేముంది?
- ఫలానా సమయంలో ఆడపిల్లలు బయటికి వెళ్లకూడదని అంటున్నారు
తాను విమానంలో ప్రయాణిస్తోన్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని దంగల్ నటి జైరా వసీం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహిళా సాధికారత అంటూ పలుసార్లు గళం విప్పిన క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ విషయంపై స్పందించింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జరిగిన దారుణాన్ని బయటికి చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. కొందరు జైరా వసీందే తప్పని అంటున్నారని, అలా ఎందుకు అనాలని నిలదీసింది.
ఆమె స్థానంలో తాను ఉంటే వేధించిన వాడి కాళ్లు విరగ్గొట్టేదాన్నని కంగనా చెప్పింది. అలాంటి డ్రెస్సు వేసుకోవద్దని, ఫలానా సమయంలో బయటికి వెళ్లకూడదని ఆడపిల్లలకు ఎందుకు చెబుతున్నారని నిలదీసింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇటువంటివే చెబుతుంటారని, బయట పోకిరీలు చేసే పనులకు మనమెలా కారకులవుతామని ప్రశ్నించింది. ఆడపిల్లలు వేసుకునే దుస్తులు, చేసే పనులు ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేయడానికి ఎలా కారణమవుతాయని అడిగింది. లైంగిక వేధింపులకు గురైన విషయాలు ఎందుకు చెబుతున్నావని ఆడపిల్లలను అడగడం సరికాదని తెలిపింది.