pawan kalyan: 'పవన్ కల్యాణ్ ను చంపేస్తా'నన్న వెంకటరెడ్డి అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ ను ఏమైనా అంటే చంపేస్తానంటూ హెచ్చరించిన వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు హత్య కేసుల్లో వెంకటరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. పవన్ ను హెచ్చరిస్తూ తీసిన సెల్ఫీ వీడియోను అతను ఫేస్ బుక్ లో పెట్టాడు. ఈ వీడియా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు.

జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ కిస్కా గొట్టంగాడని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని వీడియోలో వెంకటరెడ్డి హెచ్చరించాడు. జబర్దస్త్ హైపర్ ఆదితో జగన్ సమానమని... ప్రజలకు జగన్ దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని చెప్పాడు. తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరాడు. మరోవైపు, అతను ప్రస్తుతం హీరో నితిన్ రెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యాన్స్ ఆలిండియా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 
Go Back to Shorts
pawan kalyan
janasena
Jagan
YSRCP

More Telugu News