Rajamouli: చంద్రబాబు గారూ... చాలా కృతజ్ఞతలు!: రాజమౌళి

  • భవంతుల నమూనాలపై రాజమౌళి సూచనలు
  • అసెంబ్లీలో తెలుగుతల్లి విగ్రహం పెడదామన్న రాజమౌళి
  • వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు
నిన్న అమరావతికి వెళ్లి, పలు భవంతుల నమూనాలపై తన అభిప్రాయాలను ఏపీ ప్రభుత్వానికి వెల్లడించి వచ్చిన దర్శక దిగ్గజం రాజమౌళి, ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇచ్చిన ఓ ఐడియాకు చంద్రబాబు ఓకే చెప్పారని పేర్కొంటూ వీడియోను పోస్టు చేశారు.

తనకు అవకాశం ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు పేర్కొంటూ, కొత్త అవకాశాలను వెతికే క్రమంలో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. అసెంబ్లీ భవనంలో తెలుగుతల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న తన ఆలోచనకు చంద్రబాబు అంగీకారం తెలిపారని పేర్కొంటూ ఓ గ్రాఫిక్ వీడియోను పోస్టు చేశారు.



Rajamouli
Chandrababu
Andhra Pradesh
Amaravati

More Telugu News