కృష్ణానది: కృష్ణానదిలో సీ-ప్లేన్ లో చక్కర్లు కొట్టిన సీఎం చంద్రబాబు

  • విజయవాడలో సీ-ప్లేన్ ను ప్రారంభించిన చంద్రబాబు
  • ట్రయల్ రన్ నిర్వహణ
  • సీ-ప్లేన్ లో చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీ-ప్లేన్ లో చక్కర్లు కొట్టారు. కృష్ణానదిలో ఈరోజు  సీ-ప్లేన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. పున్నమి ఘాట్ నుంచి చక్కర్లు కొట్టిన ఈ సీ-ప్లేన్ లో చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ఆర్థిక మంత్రి యనమలతో పాటు ఓ విద్యార్థిని ఉన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అశోక్ గజపతిరాజు తన మంత్రిత్వ శాఖ ద్వారా చాలా మంచిపనులు చేశారని, లోకల్ కనెక్టివిటీ కింద ఈ మధ్య కాలంలో చాలా ఫ్లైట్లను వేశారని చెప్పారు. తద్వారా ఎన్నడూ ఫ్లైట్ ఎక్కనివారికి కూడా ఫ్లైట్ ఎక్కే అవకాశం లభించిందని, మన రాష్ట్రంలో ఫ్లైట్స్ ఎక్కే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు.

అన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ రావాలని, ఎయిర్ పోర్టులు నిర్మించే అవకాశం లేని చోట సీ-ప్లేన్ సేవలు అందుతాయని అన్నారు. అమరావతి నుంచి అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతామని, ప్రకాశం బ్యారేజ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, గుజరాత్ లో సబర్మతీ నదిలో ప్రధాని మోదీ నిన్న సీ-ప్లేన్ లో ప్రయాణించారు.  

  • Loading...

More Telugu News