హైదరాబాద్: హైదరాబాద్ లో రేవ్ పార్టీ.. యువకులు, యువతులు అరెస్ట్
- ఓ ఫాంహౌస్ లో ఈరోజు తెల్లవారుజామున రేవ్ పార్టీ
- అమ్మాయిలతో నగ్న నృత్యాలు
- గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసుల దాడి
బర్త్ డే పార్టీ పేరిట రేవ్ పార్టీ చేసుకున్న సంఘటనలో యువకులను, ముగ్గురు యువతులను అరెస్ట్ చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్జీ కాలనీ సమీపంలోని ఒక ఫాంహౌస్ లో ఈరోజు తెల్లవారుజామున రేవ్ పార్టీ చేసుకున్నారు. అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. 15 మంది యువకులు, ముగ్గురు యువతులను అరెస్టు చేశామని, నిందితులు పాతబస్తీకి చెందిన వారని అన్నారు.