team india: దుమ్ము రేపుతున్న టీమిండియా.. రోహిత్ సెంచరీ, శ్రేయస్ హాఫ్ సెంచరీ

  • ఊచకోత కోస్తున్న రోహిత్, అయ్యర్
  • స్కోరు 272/1
  • భారీ స్కోరు దిశగా భారత్
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన టీమిండియా మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో జూలు విదిల్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో మరో సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్ లో 16వ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ గా రోహిత్ కు ఇది తొలి సెంచరీ. ఈ క్రమంలో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగవ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. సెహ్వాగ్ ను అధిగమించాడు.

మరోవైపు తొలి వన్డే ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ లంక బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి, శతకం వైపు దూసుకుపోతున్నాడు. అంతకు ముదు ఓపెనర్ శిఖర్ ధావన్ 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 112 (123 బంతులు), అయ్యర్ 81 (64 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 272 పరుగులు. 
team india
Rohit Sharma
shreyas iyyar
sri lanka cricket

More Telugu News