mahendra singh dhoni: ధోనీ, పాండ్యాల మ‌ధ్య 100 మీ.ల ప‌రుగు పందెం... గెలుపు సీనియ‌ర్‌దే!

  • శ్రీలంక‌తో రెండో వ‌న్డేకు ముందు ప్రాక్టీస్‌లో వీడియో
  • పోస్ట్ చేసిన బీసీసీఐ
  • ఆల్వేస్ ఫిట్ అని మ‌రోసారి నిరూపించిన ధోనీ
భార‌త జ‌ట్టు సీనియ‌ర్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, జూనియ‌ర్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యాల మ‌ధ్య 100 మీట‌ర్ల ప‌రుగు పందెం వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. శ్రీలంక‌తో మొహాలిలో రెండో వ‌న్డేకు ముందు జ‌రిగిన ప్రాక్టీస్‌లో ఈ పందెం జ‌రిగింది. ఈ పందెంలో మాజీ కెప్టెన్ ధోనీ గెలిచి తాను ఎప్ప‌టికీ ఫిట్ అని మ‌రోసారి నిరూపించాడు.

ప‌రుగు ప్రారంభంలో హార్దిక్, ధోనీని దాటిన‌ట్లు అనిపించిన‌ప్ప‌టికీ చివ‌రికి వ‌చ్చేసరికి ధోనీ ముందుండటం వీడియోలో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ధోనీని దాట‌డానికి హార్దిక్ తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు, కానీ కుద‌ర‌లేదు. 36 ఏళ్ల ధోనీ, 24 ఏళ్ల ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాను గెల‌వ‌డం చూసిన అభిమానులు ధోనీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.
mahendra singh dhoni
hardik pandya
captain
cool
practice session
bcci

More Telugu News