Chandrababu: చంద్రబాబుగారూ, మీరు ఇప్పటికిప్పుడు రావాలనుకున్నా రావచ్చన్న గడ్కరీ.. ఢిల్లీ బయల్దేరుతున్న సీఎం!

  • నేడు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు
  • సాయంత్రం 7.15కి గడ్కరీతో సమావేశం
  • పోలవరం అడ్డంకులను తొలగించుకునే యత్నంలో సీఎం
ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. టెండర్ వివాదాలు, ఆరోపణలు, అడ్డంకుల నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు నిన్న మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ వేగాన్ని పెంచాలని, పలు విషయాలోపై మీతో మాట్లాలని, సమయం ఇవ్వాలని కోరారు.

చంద్రబాబు విన్నపంపై స్పందించిన నితిన్ గడ్కర్ 'చంద్రబాబుగారూ, మీరు ఎప్పుడైనా రావచ్చు... ఇప్పటికిప్పుడు రావాలనుకున్నా నాకు అభ్యంతరం లేదు' అని అన్నారు. ఈ నేపథ్యంలో, గడ్కరీతో చంద్రబాబు భేటీకి ఈ రాత్రి 7.15 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది. దీంతో, చంద్రబాబు ఢిల్లీ బయల్దేరుతున్నారు.  
Chandrababu
nitin gadkari
polavaram project

More Telugu News