Odisa: ఓసారి కలుద్దామన్న ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్... ఓకే చెప్పిన చంద్రబాబు!

  • పోలవరంపై చర్చించుకుందాం
  • సమావేశానికి తెలంగాణ, చత్తీస్ గఢ్ సీఎంలు కూడా
  • త్వరలో తేదీ ఖరారు
పోలవరం ప్రాజెక్టుపై తమకున్న అభ్యంతరాల గురించి తెలుసుకుని అనుమానాలను నివృత్తి చేసేందుకు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం నిర్వహిద్దామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నుంచి వచ్చిన విజ్ఞప్తికి చంద్రబాబు ఓకే చెప్పారు. పోలవరంతో సంబంధమున్న తెలంగాణ, చత్తీస్ గఢ్ సీఎంలను కూడా పిలుద్దామని వారు నిర్ణయించారు.

ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని ఒడిశా అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఉదయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కేసు విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసిన ధర్మాసనం, ఈ లోగా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది.
Odisa
naveen patnayak
Chandrababu
polavaram

More Telugu News