rajnikanth: ర‌జ‌నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'కాలా' సెకండ్ లుక్‌... విడుద‌ల చేసిన ధ‌నుష్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'కాలా' సెకండ్ లుక్‌ను అల్లుడు, చిత్ర నిర్మాత ధ‌నుష్ విడుద‌ల చేశారు. నలుపు రంగు చొక్కా, క‌ళ్ల‌ద్దాలు, చెదిరిన గ‌డ్డంతో రఫ్‌లుక్‌లో క‌నిపిస్తున్న ర‌జ‌నీ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ లుక్ నిజంగా స్టైల్‌కి చిరునామాగా ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

'కింగ్ ఆఫ్ స్టైల్‌' అంటూ ధ‌నుష్ ఈ సెకండ్ లుక్‌ని ట్వీట్ చేశారు. క‌బాలి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పా రంజిత్ ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో హ్యూమా ఖురేషీ, సాక్షి అగ‌ర్వాల్‌, నానా ప‌టేక‌ర్‌, పంక‌జ్ త్రిపాఠిలు న‌టిస్తున్నారు.
rajnikanth
kaala
second look
dhanush
superstar
king of style

More Telugu News