Krishna Dist: టీడీపీ నేత అవిర్నేని కన్నుమూత

  • శతాధిక వృద్ధుడు అవిర్నేని గోపాలకృష్ణయ్య
  • 108 సంవత్సరాల వయసులో సహజ మరణం 
  • వ్యవసాయ రంగంలో అపారమైన అనుభవం
  • సంతాపం తెలిపిన తెలుగుదేశం పెద్దలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శతాధిక వృద్ధుడు, ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి టీడీపీలోనే ఉంటూ, కృష్ణా జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన అవిర్నేని గోపాలకృష్ణయ్య కన్నుమూశారు. ఆయన వయసు 108 సంవత్సరాలు. భార్య, కుమారుడు ఉన్నారు. 102 సంవత్సరాల వరకు సైకిల్‌ తొక్కుతూ, స్వయంగా పొలం పనులు చూసుకుంటూ, చలాకీగా కనిపించిన ఆయన, గత కొంతకాలంగా వృద్ధాప్య రుగ్మతలతో బాధపడుతున్నారు. వ్యవసాయ రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Krishna Dist
Avirneni Gopalakrishnaiha
Telugudesam

More Telugu News