Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి

*  'మనం వేసుకునే ప్లాన్లన్నీ సినిమా రంగంలో వర్కౌట్ కావు..' అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. "ఏడాదికి ఐదారు సినిమాలు చేసేయాలని, ఫలానా సినిమాల్లో నటించాలని మనం అనుకుంటూ వుంటాం. కానీ, ఇతర రంగాలలో ప్రణాళిక ప్రకారం జరిగినట్టు ఇక్కడ జరగదు. మనం అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. అందుకే, నేను ముందుగా ప్లాన్లు వేసుకోను" అని చెప్పింది.      
*  ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టయిన 'బాహుబలి 2' చిత్రాన్ని జపాన్ భాషలోకి అనువదించారు. తాజాగా ఈ చిత్రానికి అక్కడి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నెల 29న అక్కడ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఫిదా' ఫేం సాయి పల్లవి నటించనుంది. నితిన్, శర్వానంద్ లతో హరీష్ శంకర్ ఓ మల్టీ స్టారర్ తీస్తున్న సంగతి విదితమే. ఇందులో ఓ హీరోయిన్ పాత్రకు సాయిపల్లవిని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా గోవాలో జరుగుతోంది. నేటితో అక్కడి షెడ్యూలు పూర్తవుతోంది. ఈ షూటింగులో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను, ఓ పాటను చిత్రీకరించారు.    
Go Back to Shorts
Kajal Agarwal
Bahubali
Saipallavi
alluarjun

More Telugu News