దయచేసి ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవద్దు: 'మా' అధ్యక్షుడు శివాజీరాజా
- దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దు
- ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయి
- సమస్యలు ఉంటే మాతో చర్చించండి
గతంలో సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబం మొత్తం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. నటీనటులకు 'మా' చేయూతను ఇస్తోందని తెలిపారు. ఒత్తిళ్లకు గురైనవారికి అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇస్తామని తెలిపారు.