Amitabh Bachchan: సోష‌ల్ మీడియాలో అమితాబ్ ఫాలోవ‌ర్ల సంఖ్య‌... 80 మిలియ‌న్లు!

షార్ట్స్‌లో చూడండి
తాను చేసిన ప్ర‌తి పోస్టుకు నంబర్ వేస్తూ... సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ట‌చ్‌లో ఉండే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ‌మొత్తం మీద 80 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం ఇలా అన్ని మాధ్య‌మాల్లో క‌లిపి 80 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను అమితాబ్ సంపాదించుకున్నారు.

కేవ‌లం తెర మీద న‌ట‌న‌తో మాత్ర‌మే కాదు... త‌న న‌ట‌జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను, కుటుంబ విష‌యాల‌ను, స్నేహితుల‌కు విషెస్‌లు చెప్ప‌డం, స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే విష‌యాల‌ను షేర్ చేయ‌డం ద్వారా కూడా అమితాబ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఆయ‌న‌కు ట్విట్టర్లో 31.7 మిలియన్లు,   ఫేస్‌బుక్‌ లో  27,731,622 మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌', '102 నాట్ అవుట్‌'  సినిమాల్లో నటిస్తున్నారు.
Go Back to Shorts
Amitabh Bachchan
twitter
social media
followers

More Telugu News