pooja hegde: ఫ్యాషన్ వీక్స్ కు తప్పకుండా వెళతా.. హీరోయిన్ పూజా హెగ్డే!

  • కొత్త ప్రాంతాలను చూడటం చాలా ఇష్టం
  • నేనెక్కడుంటే అక్కడ సందడి ఉండాల్సిందే
  • నా రాక కోసం స్నేహితులు ఎదురు చూస్తుంటారు
బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో సైతం నటిస్తూ, ఆకట్టుకుంటున్న పూజా హెగ్డేకు కొత్త ప్రాంతాలను చూడటమంటే చాలా ఇష్టం అట. పుస్తకాలను చదవడం కూడా తనకు చాలా ఇష్టమని పూజ తెలిపింది. బెంగళూరులో గడపడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని... అక్కడ జరిగే ఫ్యాషన్ వీక్స్ కు తప్పకుండా హాజరవుతుంటానని చెప్పింది. అక్కడకు వస్తూపోతూ ఉన్నప్పుడు తనకు ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారని తెలిపింది. తాను ఎక్కడుంటే అక్కడ చాలా సరదాగా ఉండాల్సిందేనని, జోకులు పేలాల్సిందేనని చెప్పింది. తన ఈ స్వభావం అందరికీ నచ్చుతుందని, అందుకే తన రాక కోసం స్నేహితులంతా ఎదురు చూస్తుంటారని తెలిపింది. ఇంగ్లీష్ షోలలో తనకు 'మోడర్న్ ఫ్యామిలీ', 'హౌస్ ఎండీ', 'గ్రే అనాటమీ'లు బాగా నచ్చుతాయని చెప్పింది.
pooja hegde
tollywood
bollywood

More Telugu News