Pawan Kalyan: 'పవన్ కల్యాణ్ - పరిటాల రవి - గుండు'పై స్పందించిన మంత్రి సునీత!

  • జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవం
  • నా భర్త అంత మూర్ఖుడు కాదు
  • ప్రజలు నిజాలు తెలుసుకోవాలి
  • తిరుపతిలో పరిటాల సునీత
హీరో పవన్ కల్యాణ్ కు తన భర్త పరిటాల రవి గుండు కొట్టించి అవమానించారని జరుగుతున్న ప్రచారం, దానిపై దశాబ్దాల తరువాత ఇటీవల పవన్ తొలిసారిగా స్పందించడంపై ఏపీ మంత్రి పరిటాల సునీత మాట్లాడారు. ఈ ఉదయం తిరుపతికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన భర్తకు, పవన్ కల్యాణ్ కూ సంబంధమే లేదని, ఈ విషయంలో పవన్ నిజమే చెప్పారని అన్నారు.

అసలు పరిటాల రవి, పవన్ కు గుండు ఎందుకు కొట్టిస్తారని ప్రశ్నించారు. తన భర్త అంత మూర్ఖుడు కాదని, ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని, కంటిముందు జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తున్నా, వైసీపీ నేతలకు మాత్రమే అదంతా బూటకంగా కనిపిస్తోందని సునీత విమర్శలు గుప్పించారు.
Pawan Kalyan
paritala ravi
sunita

More Telugu News