Brahmanandam: 'జై సింహా'లో బ్రహ్మానందం నిడివి తగ్గించేశారట!

షార్ట్స్‌లో చూడండి
నిన్న మొన్నటి వరకూ బ్రహ్మానందం లేని సినిమాలు ఉండేవి కావు. కొన్ని సినిమాల విజయంలో ఆయనదే ప్రధానమైన పాత్ర అనే విషయాన్ని చాలామంది ఒప్పుకుంటారు కూడా. అలాంటి బ్రహ్మానందానికి రాన్రాను అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక అవసరమైతే ఆయనకి బదులుగా మరో ఆర్టిస్టును తీసుకుంటున్నారు. 'డిక్టేటర్' విషయంలో ఇదే జరిగింది .. ఆయన కోసం అనుకున్న పాత్ర పృథ్వీకి వెళ్లింది.

ఇక తాజాగా 'జై సింహా'లో ఆయన పాత్ర నిడివిని తగ్గించినట్టుగా సమాచారం. కె.ఎస్.రవికుమార్ దర్శత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం విభిన్నమైన పాత్రను చేశాడట. అయితే సినిమా విడివి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో .. ఆయన సీన్స్ ను చాలావరకూ లేపేశారట. డబ్బింగ్ సమయంలో ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మానందం చాలా ఫీలయ్యారని వినికిడి. ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Brahmanandam

More Telugu News