Megada Ramalingachari: కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున... కదిలిన కలల ప్రాజెక్టు!

  • పుండరీకాక్షయ్య కోరిక మేరకు స్క్రిప్టు సిద్ధం
  • ఇటీవలే బాలయ్య ప్రాజెక్టు గురించి అడిగారు
  • నవావధాని మీగడ రామలింగస్వామి
చాలా కాలం నుంచి పెండింగ్ లో పడిపోయిన పౌరాణిక చిత్రం 'నరనారాయణ' తిరిగి కదిలిందా? ఈ సినిమా ప్రాజెక్టును గురించి బాలకృష్ణ మరోసారి చర్చించారా? అవుననే అంటున్నారు నవావధాని మీగడ రామలింగస్వామి. కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున హీరోలుగా, నర నారాయణుల బంధం కథాంశంగా 'నరనారాయణ' చిత్రానికి తాను ఇప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశానని, దీని గురించి ఇటీవలే తనను పిలిపించిన బాలయ్య, వివరాలు తీసుకున్నారని ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామలింగస్వామి వెల్లడించారు.

నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణల కోసం ఈ స్క్రిప్టును గతంలోనే రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని తెలిపారు. శ్రీకాకుళంలో దసరా సెలవుల్లో పని ముగించానని, మొన్నీమధ్య ప్రాజెక్టును గురించి బాలయ్యకు వివరించానని అన్నారు. గతంలో సినిమాల్లో నటించే అవకాశం లభించినా కుదర్లేదని రామలింగస్వామి వెల్లడించారు. ఇక ఈ కలల ప్రాజెక్టు ఎప్పుడు కళ్ల ముందుకు వస్తుందో?!
Megada Ramalingachari
Balakrishna
Nagarjuna
Naranarayana

More Telugu News