Winter: విజృంభిస్తున్న చలిపులి.. హైదరాబాద్‌లో 15.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

  • క్రమంగా పెరుగుతున్న చలి
  • రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు
చలి పులి పంజా విసరడం మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీనికి తోడు చలి గాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనిపించకపోవడంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చలిమంటలతో సేద తీరుతున్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 15.9 డిగ్రీలకు పడిపోయింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 డిగ్రీలుగా నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇవి ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువే అయినా చలి మాత్రం చంపేస్తోంది. శనివారం 17.1 డిగ్రీలుగా ఉన్న నగర కనిష్ఠ ఉష్ణోగ్రత ఒక్కరోజులోనే 15.9 డిగ్రీలకు పడిపోయింది. ఇకపై రోజూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
Winter
Hyderabad
telangana
Andhra Pradesh

More Telugu News