నటుడు నాగార్జున: వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం.. ఇది ఫిక్స్: నాగార్జున
- ‘హలో’ విజయం సాధిస్తుంది
- అఖిల్ లో నా తండ్రి అక్కినేని కనబడుతున్నారు
- ఆడియో వేడుకలో నాగార్జున
ప్రేక్షకులు, అభిమానులకు నచ్చే విధంగా ‘హలో’లో అఖిల్ పాత్ర ఉంటుందని నాగార్జున అన్నారు. ‘హలో’ ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అఖిల్ లో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కనపడుతున్నారని అన్నారు. ఈ నెల 22న ‘హలో’ చిత్రం విడుదల చేస్తున్నామని, ‘వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం..ఇది ఫిక్స్’ అని నాగార్జున అన్నారు.
అనంతరం, అఖిల్ తల్లి అమల మాట్లాడుతూ, చాలా ఆనందంగా ఉందని, అక్కినేని అభిమానులందరికీ తన నమస్కారాలని, వాళ్లందరి లాగానే ‘హలో’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా, ‘హలో’ ఆడియో సీడీని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.