రకుల్ ప్రీత్ సింగ్: తెలుగింటి కోడలిని అవుతానేమో!: సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్
- భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా చెబుతాం
- నేనేమీ జ్యోతిష్కురాలిని కాదు
- ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్
ఒకవేళ తెలుగు ప్రాంతానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని నటి సమంత లాగా తెలుగింటి కోడలిని అవుతానేమో అని అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ‘తోటి నటుల నుంచి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? సినీ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోరా?’ అనే ప్రశ్నలకు రకుల్ స్పందిస్తూ, ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదని, అసలు, అలాంటివి ఊహించనని చెప్పింది.
ఇంతవరకూ, తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని, నటి సమంత లాగా తాను కూడా తెలుగింటి కోడలిని అవుతానేమోనని, తెలుగు ప్రాంతానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానేమోనని చెప్పింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి తానేమీ జ్యోతిష్కురాలిని కాదని, అయినా ఆ సమయం వచ్చినప్పుడే ఆ విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చింది.