శ్రీలంకజట్టు: విజయ లక్ష్యానికి చేరువలో శ్రీలంక జట్టు
- 113 పరుగుల విజయలక్ష్యాన్నిచేరనున్న శ్రీలంక జట్టు
- క్రీజ్ లో కొనసాగుతున్న మ్యాథ్యూస్, డిక్ వెలా
- శ్రీలంక సొంతం కానున్న ధర్మశాల వన్డే మ్యాచ్
భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక విజయ లక్ష్యానికి అతి చేరువగా ఉంది. 113 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 18.4 ఓవర్లలో 100 పరుగుల స్కోర్ చేసింది. క్రీజ్ లో కొనసాగుతున్న మ్యాథ్యూస్ 21 పరుగులతో, డిక్ వెలా 18 పరుగులతో కొనసాగుతున్నారు.
కాగా, ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఘోరంగా విఫలమైంది. 38.2 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయిన టీమిండియా 112 పరుగులు చేయడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.