అసదుద్దీన్: అసలు సమస్యలపై మాత్రం మోదీ నోరుమెదపరు: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని యావత్తు దేశం ఖండించింది
- మోదీ మాత్రం మాట్లాడలేదు!
- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపాటు
అన్ని అంశాలపైనా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారుగానీ, అసలు సమస్యలపై మాత్రం ఆయన నోరుమెదపరని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రాజస్థాన్ లవ్ జిహాద్ అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడారు. రాజస్థాన్ లో అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని యావత్తు దేశం ఖండించిందని, ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ మోదీ మాత్రం స్పందించలేదని మండిపడ్డారు. యాభై సంవత్సరాలున్న వ్యక్తి లవ్ జిహాద్ కు పాల్పడ్డాడనే ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం, ముస్లిం అన్న కారణంగానే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.